![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -298 లో......సందీప్, ధనలు భద్రం చేసే ట్రాప్ లో ఈజీగా పడిపోతారు. ఈ వెంచర్ పూర్తి కాకుండానే మనం ఇంకొక వెంచర్ మొదలు పెట్టాలని భద్రం అంటాడు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు కదా అని సందీప్ అనగానే.. అది అయ్యేసరికి టైమ్ పడుతుంది. అంతసేపు ఖాళీగా ఉంటామా.. అందుకే ఈ లోపు ఇంకొకటి మొదలు పెట్టాలని భద్రం అంటాడు. దానికి వాళ్ళు కూడా సరే అంటారు. మనం కూడా ఇక కొత్త కంపెనీ పెట్టాలని ధన అంటాడు. మిమ్మల్ని మోసం చేసి ఈ డబ్బుతో పారిపోతానని భద్రం మనసులో అనుకుంటాడు.
మరొకవైపు సీతాకాంత్ కి సిరి ఫోన్ చేసి.. తన సీమాంతానికి రమ్మని చెప్తుంది. వస్తామని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నా చెల్లికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ నేనేం లేని వాడిని అయిపోయనని సీతాకాంత్ బాధపడుతుంటే రామలక్ష్మి గల్లా పగులగొట్టి డబ్బులు ఇస్తుంది. దీంతో మీ చెల్లికి సారె తీసుకోండి అంటుంది రామలక్ష్మి. దానికి సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరుసటిరోజు ఉదయం రామలక్ష్మి, సీతాకాంత్ లు సిరి శ్రీమంతానికి వస్తారు. అక్కడున్న సెక్యూరిటీ మీరున్నప్పుడే బాగుండేది సర్ ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు.. జీతం కూడా సరిగా ఇవ్వడం లేదని సీతాకాంత్ కి చెప్తూ బాధపడుతుంటాడు. దాంతో తన చేతిలోని డబ్బు సీతాకాంత్ సెక్యూరిటీకి ఇస్తాడు.
ఆ తర్వాత వాళ్లు రావడం చూసి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ శ్రీవల్లి, శ్రీలతలు అడుగుతారు. సిరి పిలిచింది అందుకే వచ్చామని రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి సీతాకాంత్ లని అడుగడుగునా అవమానం చేస్తుంటారు. సోఫా లో కూర్చోబోతుంటే కింద కూర్చొమని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |